Friday, November 22, 2024
HomeTrending Newsఏపీలో కూడా అధికారం చేపడతాం: రాజ్ నాథ్ సింగ్

ఏపీలో కూడా అధికారం చేపడతాం: రాజ్ నాథ్ సింగ్

2027 నాటికి ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించబోతోందని కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఏపీ బిజెపి ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన రైజింగ్ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మేధావులు, మాజీ సైనికాధికారులతో  భేటీ  అయ్యారు. ఈ సభలో రాజ్ నాథ్ మాట్లాడుతూ 2014లో తాము అధికారంలోకి వచ్చే సమయానికి భారత్ 11వ స్థానంలో ఉందని, మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో ఇప్పుడు ఐదో స్థానానికి తీసుకురాగలిగామని తెలిపారు. మన దేశంలో అమలు చేసిన యూపీఐ చెల్లింపులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందని, మిగతా దేశాలు కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా తయారు చేస్తామని పేర్కొన్నారు.

ఏపీలో బిజెపికి ఆదరణ పెరుగుతోందని, ఇప్పుడు కాకపోయినా  ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల్లోనైనా అధికారం చేజిక్కించుకుంటామని రాజ్ నాథ్ ధీమా వ్యక్తం చేశారు. బిజెపిపై ఉత్తర భారతదేశ పార్టీ అనే ముద్ర వేయడం శోచనీయమని, హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో కూడా బిజెపి అధికారంలో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.  ఏపీ, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా తమ పార్టీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఓసారి, కేంద్రంలో మరోసారి అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్తామని ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే బదులు దాన్ని లాభాల బాటలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని… కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రతి మూడు రోజులకోసారి స్టీల్ ప్లాంట్ పురోగతిపై స్వయంగా సమీక్ష చేస్తున్నారని వివరించారు.. ఏపీ ప్రభుత్వం స్థలం ఇవ్వనందువల్లే రైల్వే జోన్ ఏర్పాటు చేయలేకపోయామని, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని లోక్ సభ సాక్షిగా ప్రకటించారని, కానీ ఎప్పుడూ నెపాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై నెట్టడం ఎంతవరకూ సమంజసమని ఆమె ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్