Sunday, March 15, 2026
HomeTrending NewsRakshabandhan: ప్రగతిభవన్లో రక్షాబంధన్ వేడుకలు

Rakshabandhan: ప్రగతిభవన్లో రక్షాబంధన్ వేడుకలు

రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికగా నిలిచింది. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి వారి అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి రాఖీ పండుగ వేడుకలు జరుపుకున్నారు.


ఈ సందర్భంగా అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారి అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular