Friday, September 27, 2024
HomeసినిమాPolice Station Private Limited: రక్షిత్ అట్లూరి హీరో గా 'పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్'

Police Station Private Limited: రక్షిత్ అట్లూరి హీరో గా ‘పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్’

మంత్ర ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రక్షిత్ అట్లూరి హీరోగా, గొల్లపాటి నాగేశ్వరావు దర్శకత్వంలో విశ్వేశ్వర శర్మ మరియు రాజరాయ్ లు నిర్మిస్తున్న చిత్రం ‘పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్’. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగాయి. ఈ సినిమా ముహూర్త‌పు స‌న్నివేశానికి కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి క్లాప్ కొట్టగా, ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గొల్లపాటి నాగేశ్వరావు మాట్లాడుతూ… ఈ సినిమా కథ కొత్తగా ఉండబోతుంది. ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సస్పెన్స్ యాక్షన్ డ్రామా, పోలీస్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఏప్రిల్ 15 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.

హీరో రక్షిత్ మాట్లాడుతూ… డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను. ఒక మంచి టీమ్ తో కలిసి ఈ సినిమా చేస్తున్నాం. కథ విన్న వెంటనే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్