Saturday, January 18, 2025
Homeసినిమాడ్రగ్స్‌తో పట్టుబడ్డ హీరోయిన్ రకుల్ సోదరుడు అరెస్ట్

డ్రగ్స్‌తో పట్టుబడ్డ హీరోయిన్ రకుల్ సోదరుడు అరెస్ట్

ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌ డివిజన్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు ఉన్నారు. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌సింగ్‌‌ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కాడు.

కాగా.. గతంలో డ్రగ్స్‌ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆరోపణలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరాపై పక్కా సమాచారంతో నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు. దాదాపు 200 గ్రాములకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పలువురు వీఐపీలకు కూడా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్