Friday, March 20, 2026
Homeసినిమా'చరణ్‌ 17'వ చిత్రం ఫిక్స్ అయ్యిందా..?

‘చరణ్‌ 17’వ చిత్రం ఫిక్స్ అయ్యిందా..?

రామ్ చరణ్‌ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తర్వాత ఆచార్య సినిమా రిలీజ్ చేశాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. నెక్ట్స్ షెడ్యూల్ కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర ప్లాన్ చేశారు. అక్కడ ఓ చిన్ని షెడ్యూల్ షూట్ ఉంది. ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇంకా షూటింగ్ చేయాల్సింది చాలా ఉంది. అందుచేత సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీ తర్వాత చరణ్‌, బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటుంది. ఇందులో చరణ్‌ కు జంటగా జాన్వీకపూర్ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పాడని తెలిసింది. ఇంతకీ ఎవరితో అంటే.. గత కొంత కాలంగా రామ్ చరణ్, నర్తన్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల నర్తన్ చెప్పిన లైన్ నచ్చడంతో రామ్ చరణ్ తనతో ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది. నావీ యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమా వుండబోతోందని ఈ మూవీ కోసం చరణ్ కూడా చాలా ఎగ్జైటెడ్ గా వున్నాడని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం వుందని ఇన్ సైడ్ టాక్. ఈ విధంగా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకెళుతున్నాడు మెగా పవర్ స్టార్.

Also Read: చరణ్‌ తో నటిస్తే.. పెళ్లైపోతుందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular