Sunday, January 19, 2025
Homeసినిమామరోసారి 'రంగస్థలం' కాంబినేషన్?

మరోసారి ‘రంగస్థలం’ కాంబినేషన్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో చరణ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నారు. ఈ క్రేజీ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ  హీరోయిన్ గా నటిస్తోంది.  సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో  మూవీ చేయనున్నారు.  ఇప్పటికే ప్రకటించిన ఈ  షూటింగ్ ఈ  ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ రెండు సినిమాల తర్వాత చరణ్‌ ఎవరితో సినిమా చేయనున్నారనేది ప్రకటించలేదు కానీ.. సుకుమార్ తో  ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి  కాంబినేషన్లో  వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. అన్నింటి కంటే ముఖ్యంగా  చరణ్ లో ఉన్న నటుడ్ని రంగస్థలం నిరూపించిందని చెప్పచ్చు. చిట్టిబాబు పాత్రకు తగ్గట్టుగా నటించి చరణ్ మెప్పించారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ కాంబో సెట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం సుకుమార్.. అల్లు అర్జున్ తో పుష్ప 2 చేస్తున్నారు. ఇటీవల వైజాగ్ లో ఓ సాంగ్ చిత్రీకరించారు. అలాగే రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. విదేశాల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. పుష్ప 2 పూర్తైన తర్వాత చరణ్‌ తో సుకుమార్ సినిమా ఉంటుందట. ఈలోపు చరణ్ శంకర్ తో సినిమా పూర్తి చేసి బుచ్చిబాబు సినిమా స్టార్ట్ చేస్తాడు. బుచ్చిబాబు మూవీ కంప్లీట్ అయిన తర్వాత చరణ్ తో సుక్కు మూవీ సెట్స్ పైకి వస్తుందని.. ఇందులో చరణ్‌ కు జంటగా కీర్తి సురేష్‌, ఆషిక రంగనాథ్ నటించనున్నారని సమాచారం. మరి.. రంగస్థలంలో చరణ్ ని చిట్టిబాబుగా చూపించిన సుకుమార్.. ఈసారి ఎలా చూపిస్తాడో?

RELATED ARTICLES

Most Popular

న్యూస్