Sunday, February 23, 2025
Homeసినిమాపునీత్ కుటుంబ సభ్యులకు రామ్ చ‌ర‌ణ్ పరామర్శ

పునీత్ కుటుంబ సభ్యులకు రామ్ చ‌ర‌ణ్ పరామర్శ

Ram Charan Consoled The Family Of Puneeth Raj Kumar At Bangalore :

కన్నడ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి దేశవ్యాప్తంగా అంద‌రినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న వయసులోనే ఆయన తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడం ప్రతి ఒక్కరి హృద‌యాల‌ను క‌ల‌చి వేసింది. పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చిరంజీవి, బాలకృష్ణ,  వెంకటేష్, ఎన్టీఆర్, శ్రీకాంత్ లతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ మృత దేహంను సందర్శించి నివాళులు అర్పించారు.

ఇటీవలే నాగార్జున బెంగళూరుకు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెల్సిందే. ఈరోజు రామ్ చ‌ర‌ణ్ కూడా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ స‌భ్యుల‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ తో తనకు ఉన్న అనుబంధాన్ని చరణ్ నెమరు వేసుకున్నారు. పునీత్ మ‌ర‌ణించిన స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ చిత్రంలో చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. అందువలన ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్ ను ముగించుకున్న తర్వాత పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి చరణ్ పరామర్శించారు. ఆ స‌మ‌యంలో అందుబాటు లేని చాలా మంది ప్ర‌ముఖులు బెంగుళూర్ లో పునీత్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.

Must Read :పునీత్ కి నిజమైన స్నేహితుడు అనిపించిన విశాల్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్