Saturday, January 18, 2025
Homeసినిమా'పుష్ప 2'లో చరణ్ క్యారెక్టర్ ఇదేనా?

‘పుష్ప 2’లో చరణ్ క్యారెక్టర్ ఇదేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటి వ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్ప  అంచనాలకు మించిన సక్సెస్ అందించింది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం పుష్ప రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం. ఇటీవల రష్యాలో పుష్ప రిలీజై అక్కడ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. దీంతో పుష్ప 2 మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అయ్యింది. రష్యాలో ప్రమోషన్స్ చేయడం కోసం కొంత గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పుష్ప 2 సినిమాలో డైలాగ్ ఉంటూ ఓ డైలాగ్ లీక్ అవ్వడం.. ఆ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే. దీంతో పుష్ప 2 మరింత ఆసక్తి ఏర్పడింది. తాజాగా పుష్ప 2 మూవీలో మరో హీరో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు చరణ్‌ పోషించే పాత్ర కలెక్టర్ క్యారెక్టర్ అని.. ఇటీవల సుకుమార్.. చరణ్‌ ని కలసి ఈ క్యారెక్టర్ గురించి చెప్పారని.. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగా ఈ క్యారెక్టర్ చేయడానికి ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది.

గతంలో చరణ్‌, బన్నీ కలిసి ఎవడు సినిమాలో నటించారు. అయితే.. ఆ సినిమాలో ఇద్దరు కలిసి కనిపించే సన్నివేశం ఉండదు. ఇప్పుడు పుష్ప 2 లో వీరిద్దరూ కలిసి కనిపించే సీన్ ఉంటుందని.. అభిమానులకు ఈ సీన్ పండగే అనేలా ఉంటుందని అంటున్నారు. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినప్పటికీ పుష్ప 2 చిత్రం అంతకు మించి అనేలా ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకి బడ్జెట్ పరిమితులు అంటూ ఏమీ పెట్టుకోలేదట. ఎంత బడ్జెట్ పెట్టడానికైనా సరే.. పెట్టాలి అనుకుంటున్నారట. మరి… పుష్ప 2 ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read : లీకైన ‘పుష్ప 2’ డైలాగ్ అదిరింది… 

RELATED ARTICLES

Most Popular

న్యూస్