Friday, March 20, 2026
HomeసినిమాRam Charan: కల నిజమైంది అంటున్న గ్లోబల్ స్టార్

Ram Charan: కల నిజమైంది అంటున్న గ్లోబల్ స్టార్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, టాలీవుడ్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేష్‌లతో క‌లిసి  చేసిన డ్యాన్స్‌కి  అద్భుత స్పందన వ‌చ్చింది. రిలీజైన రెండు రోజుల్లోనే అన్నీ సామాజిక మాధ్య‌మాల్లో క‌లిపి 43 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ను సాధించి దూసుకెళ్తోంది.

ఈ సాంగ్‌కు సంబంధించిన బీటీఎస్ వీడియో రిలీజ్ చేశారు. ఏంట‌మ్మా చేసేట‌ప్పుడు తెగ ఎంజాయ్ చేశాన‌ని, అంద‌రం క‌లిసి అద‌ర గొట్టేశామ‌ని చెప్పారు రామ్ చరణ్‌. ఇద్ద‌రు పెద్ద స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించటంతో తన క‌ల నిజ‌మైన‌ట్లుగా ఉంద‌ని, మ‌ర‌చిపోలేని అనుభూతి అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాటను వెండితెర పై చూసినప్పుడు ఫ్యాన్స్‌కి పండ‌గ‌లా ఉంటుంద‌ని.. అభిమానులు అయితే… కూర్చీలో కూర్చోరని, డ్యాన్సులతో అదరగొడతారని ధీమాగా చెప్పారు.

ఏంట‌మ్మా సాంగ్‌కు పాయ‌ల్ దేవ్ సంగీత సార‌థ్యం వ‌హించగా విశాల్ డ‌డ్లాని, పాయల్ దేవ్, ర‌ఫ్లార్ ఆల‌పించారు. ష‌బీర్ అహ్మ‌ద్ సాహిత్యాన్ని అందించగా జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఈ చిత్రం ఈద్ సంద‌ర్భంగా ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది.

Also Read : Lungi Dance: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న వెంకీ, సల్మాన్, చరణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular