Sunday, January 19, 2025
Homeసినిమాఉక్రెయిన్ సెక్యూరిటీ గార్డ్ కు రామ్ చరణ్ సాయం

ఉక్రెయిన్ సెక్యూరిటీ గార్డ్ కు రామ్ చరణ్ సాయం

Ukraine Guard: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే.. ఈ యుద్ధంతో ఇబ్బందులు పడుతున్న ఓ కుటుంబానికి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రత్యేక సాయం చేశారు. నిజానికి ఉక్రెయిన్‌కి, చరణ్ కి సంబంధం లేదు కానీ.. రష్యా సైనికుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటున్న ఒక ఉక్రెయిన్‌ పౌరుడికి, రామ్‌చరణ్‌కు సంబంధం ఉంది. రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటించిన ట్రిపుల్‌ ఆర్‌ మూవీ షూటింగ్‌ కొంతకాలం ఉక్రెయిన్‌లో కూడా జరిగింది. ఆ షూటింగ్‌ జరిగే సమయంలో రస్తీ అనే వ్యక్తి చరణ్ కు సెక్యూరిటీ గార్డ్‌ గా పనిచేశారు. దీంతో చరణ్‌తో రస్తీకి సాన్నిహిత్యం ఏర్పడింది.

అయితే.. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్ష్యుడి పిలుపు మేరకు 80 ఏళ్ళ రస్తీ తండ్రి, రస్తీ కూడా మిలిటరీలో చేరి తమ దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధం కారణంగా రస్తీ ఆ దేశ పౌరులలానే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం అనగానే తనకు ఉక్రెయిన్లో రక్షణ అందించిన రస్తీనే చరణ్ కు గుర్తు వచ్చారు. వెంటనే పలకరించగా రస్తీ పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. వెంటనే రస్తీ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. చెర్రీ తనకు చేసిన సాయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు రస్తీ. ఆయన కోసం పనిచేసింది కొంత కాలమే అయినా, కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోవడం చరణ్‌ గొప్ప మనసుకి నిదర్శనమని రస్తీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్