మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగి ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకున్నారు. ఒక వ్యక్తిగా ఇండస్ట్రీలో ప్రవేశించి నేడు ఓ శక్తిగా మారారు. అయితే.. తన నట ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిరంజీవి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకునే వాళ్ల కోసం www.kchiranjeevi.com అనే వైబ్ సైట్ ను ఏర్పాటు చేశారు. నేడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జరిగిన కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఇందులో చిరంజీవి జీవితం, ఆయన నటించిన సినిమాలు, పాటలు.. దర్శక నిర్మాతలతో ఆయనకున్న అనుబంధం గురించిన పూర్తి సమాచారం ఉంటుంది.
ఈ వెబ్ సైట్ తో పాటు www.chiranjeevicharitabletrust.com అనే మరో వెబ్ సైట్ ను కూడా చరణ్ లాంచ్ చేశారు. ఈ వెబ్ సైట్ 25 భాషల్లో ఉండడం విశేషం. ఎవరైనా బ్లడ్ డోనేట్ చేయాలనుకున్న వారు కూడా ఈ వెబ్ సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని బ్లడ్ డోనేట్ చేయచ్చు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్ లో ఉన్నాయి. మరిన్ని ప్రాంతాలకు, మరెంతో మందికి చిరు బ్లడ్, ఐ బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ వెబ్‌సైట్ ప్రారంభించినట్లు రామ్ చరణ్ తెలియచేశారు.