#RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే.. చరణ్.. గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత చరణ్.. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. నిజంగానే చరణ్.. గౌతమ్ తో సినిమా చేయనున్నాడా..? అనే సందేహం అభిమానుల్లో కనిపిస్తోంది.
అయితే… సోషల్ మీడియాలో గౌతమ్ తిన్ననూరిని తాజాగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నతో క్లారిటీ వచ్చేసింది. చరణ్ తో మంచి సినిమా చేయాలి … ఆయన క్యారెక్టరైజేషన్ అదిరిపోవాలి అని అభిమాని చెబితే.. చరణ్ తో సినిమా చేయడం అనేది నా డ్రీమ్.. ఆయన సినిమా కోసం నా వైపు నుంచి ది బెస్ట్ ఇస్తాను అని చెప్పుకొచ్చాడు. దాంతో చరణ్ తన 16వ సినిమాను గౌతమ్ తిన్ననూరితోనే చేయనున్నాడనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. మరి.. చరణ్ ని గౌతమ్ ఎలా చూపిస్తారో..? ఇంకాస్త క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read : ఆర్ఆర్ఆర్ రన్ టైమ్ ఎంతో తెలుసా?