Sunday, January 19, 2025
HomeసినిమాGame Changer: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’

Game Changer: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుప్రసిద్ధ దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న సినిమాకు ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ బ్యానర్ కు ఇది 50వ సినిమా కాగా, చరణ్ కు 15వ సినిమా.

శంకర్ తెలుగులో డైరెక్ట్ గా చేస్తున్న తొలి చిత్రం ఇది. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా… ఇంతకుముందు ‘వినయ విధేయ రామ సినిమా’లో కలిసి నటించారు. చరణ్ ద్విపాత్రాభినయం ఛేస్తుండడం విశేషం. శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాకు గతంలో పలు టైటిల్స్ పరిశీలించి ప్రచారంలోకి తీసుకు వచ్చారు. సేనాని, సేనాపతి, సీ.ఈ.వో, సైనికుడు అనే టైటిల్స్‌ను  పరిశీలించారు.  చివరకు  ‘గేమ్ ఛేంజర్’ ను ఒకే చేశారు. ఈ మూవీని డిసెంబర్ లో లేదా జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చరణ్ పాన్ ఇండియా స్టార్ గానే కాకుండా ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. గుడ్ మార్నింగ్ అమెరికా షో లో అతిథిగా పాల్గొన్నారు కూడా.  దీనితో  చరణ్ –శంకర్ తాజా సినిమాపై భారీ అంచనాలు  నెలకొన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్