Sunday, January 19, 2025
Homeసినిమాచరణ్‌, శంకర్ మూవీ వచ్చేది ఎప్పుడు..?

చరణ్‌, శంకర్ మూవీ వచ్చేది ఎప్పుడు..?

రామ్ చరణ్‌, శంకర్ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి మెగా అభిమానులే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే.. శంకర్ సినిమాలో ఏదో విషయం ఉంటుంది. బలమైన పాయింట్ తో సినిమాలు తీస్తుంటారు. పైగా తెలుగులో శంకర్ చేస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ సినిమాతో పాటు ‘ఇండియన్ 2’ సినిమాని కూడా పూర్తి చేయాల్సి రావడంతో చరణ్ మూవీ ఆలస్యం అవుతుంది.

శంకర్.. కొన్ని రోజులు చరణ్ మూవీ, మరి కొన్ని రోజులు కమల్ ఇండియన్ 2 చేస్తున్నారు. ఇటీవల వైజాగ్, హైదరాబాద్, కర్నూల్ లో చరణ్‌ మూవీ షూటింగ్ చేశారు. ఇప్పుడు ఇండియన్ 2 మూవీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చరణ్‌ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అనుకున్న విధంగా షూటింగ్ జరగకపోవడంతో సమ్మర్ లో రిలీజ్ కావడం లేదు. మరి.. ఎప్పుడు వస్తుందంటే.. 2024 సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ వార్తను మేకర్స్ ప్రకటించలేదు కానీ.. సంక్రాంతికి రావడం పక్కా అని టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఇది పీరియాడిక్ పొలిటికల్ డ్రామా. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. వెరీ స్టైలిష్ లుక్ లో విభిన్న శైలితో చరణ్, ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌ గా నిలుస్తాడని అంటున్నారు. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడని సమాచారం. అయితే.. ఇందులో ఓ సీనియర్ హీరో చేయాల్సిన పాత్ర ఉంది. అది పవన్ తో చేయించాలి అనుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. మరి.. ఆ కీలక పాత్రను ఎవరితో చేయిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్