Sunday, January 19, 2025
Homeసినిమాచ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ లేటెస్ట్ అప్ డేట్

చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ లేటెస్ట్ అప్ డేట్

రామ్ చరణ్, శంక‌ర్ కాంబినేష‌న్లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే.  బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తోంది.  దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, అంజ‌లి, సునీల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. శంక‌ర్ తెలుగులో నేరుగా  చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి.

అయితే.. శంక‌ర్.. ‘ఇండియ‌న్ 2’ సినిమా షూటింగ్ మ‌ళ్లీ స్టార్ట్ చేయ‌డంతో చ‌ర‌ణ్ మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ చేయాల‌ని ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ.. సెట్ కాలేదు. దీంతో చ‌ర‌ణ్ మూవీ షూటింగ్ ఆగిపోయింద‌ని, ఇప్ప‌ట్లో ఈ సినిమా మ‌ళ్లీ సెట్స్ పైకి రాద‌ని టాక్ వినిపించింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లోని రంపచోడవరంలో జరుగుతోంది. ఆ తర్వాత కాకినాడలో ఈ షెడ్యూల్‌ ను కొనసాగించనున్నారు.

ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్, అంజలి, శ్రీకాంత్, సముద్ర ఖని పాల్గొంటారు. ఇందులో ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. చ‌ర‌ణ్ రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్.

Also Read: ఇండియ‌న్ 2 రీస్టార్ట్ ?

RELATED ARTICLES

Most Popular

న్యూస్