Saturday, January 18, 2025
Homeసినిమావచ్చే నెలలో రామ్ చరణ్‌ - శంకర్ మూవీ

వచ్చే నెలలో రామ్ చరణ్‌ – శంకర్ మూవీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ – గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ పాన్ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రకటించిన తర్వాత శంకర్ వేరే సినిమా చేయకుండా మొదటగా ‘భారతీయుడు-2’ పూర్తి చేయాలని కోరుతూ ప్రము నిర్మాణ సంస్థ లైకా కోర్టుకెక్కింది. అయితే.. ఈ విషయంలో తాము ఆదేశాలు ఇవ్వలేమంటూ శంకర్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

కోర్టు తీర్పుతో ఛరణ్‌ – శంకర్ మూవీకి లైన్ క్లియర్ అయ్యింది. ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఆదివారం (జులై 4) చెన్నైలో ఈ ముగ్గురు కలిశారు. వచ్చే నెలల నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇది రామ్ చరణ్‌ కు 15వ చిత్రం కాగా, దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో చరణ్‌ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఆలియా భట్ కానీ.. కైరా అద్వానీ కానీ నటించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్