Sunday, March 15, 2026
Homeసినిమాఆర్ఆర్ఆర్ టీమ్ కి బంగారు కానుక ఇచ్చిన చ‌ర‌ణ్‌

ఆర్ఆర్ఆర్ టీమ్ కి బంగారు కానుక ఇచ్చిన చ‌ర‌ణ్‌

Charan gold:  ఆర్ఆర్ఆర్.. ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ క‌లెక్ష‌న్స్ తో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే.. ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డులు సృష్టిస్తూ వెయ్యి కోట్ల రూపాయల దిశ‌గా పరుగులు పెడుతుంది. ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో ఒక పక్క హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచితనాన్ని మ‌రోసారి చాటుకున్నారు. సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు. సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించారు.


వారితో కాస్త సమయం గడిపిన రామ్ చరణ్ అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడమే కాక వారికి ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సందర్భంగా రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : ఉక్రెయిన్ సెక్యూరిటీ గార్డ్ కు రామ్ చరణ్ సాయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular