Friday, March 13, 2026
Homeసినిమాచ‌ర‌ణ్ చేతుల మీదుగా ‘కేజీఎఫ్2’ ట్రైల‌ర్

చ‌ర‌ణ్ చేతుల మీదుగా ‘కేజీఎఫ్2’ ట్రైల‌ర్

KGF – Ram Charan: క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం కేజీఎఫ్‌. పాన్ ఇండియా మూవీగా రూపొందిన‌ ఈ సినిమా ఒక్క క‌న్న‌డ‌లోనే కాకుండా.. బాలీవుడ్ లో సైతం సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దీంతో కేజీఎప్ 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కేజీఎఫ్-2 తెలుగు ట్రైల‌ర్ ను మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ రోజు సాయంత్రం 6.40 గంటలకు విడుద‌ల చేస్తారని సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో చ‌ర‌ణ్‌ అల్లూరి సీతారామ‌రాజుగా అద్భుతంగా న‌టించి మెప్పించారు. దీంతో దేశ వ్యాప్తంగా పేరు వ‌చ్చింది. దీనికి తోడు ఈరోజు చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు కూడా కావ‌డంతో చర‌ణ్ తో త‌మ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేయించాల‌ని కేజీఎఫ్-2 యూనిట్ నిర్ణ‌యించింది. ఇక త‌మిళ ట్రైల‌ర్ కూడా రోజు సాయంత్రం 6.40 గంట‌ల‌కే హీరో సూర్య చేతుల మీదుగా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular