Saturday, January 18, 2025
Homeసినిమాబెట్టు చేస్తున్న హిట్టు కోసం యంగ్ హీరోల వెయిటింగ్!

బెట్టు చేస్తున్న హిట్టు కోసం యంగ్ హీరోల వెయిటింగ్!

for a Hit!  రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందిన ‘ది వారియర్’ సినిమా, ఈ నెల 14వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కానుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.  కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘రెడ్’ వంటి భారీ ఫ్లాప్ తరువాత రామ్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టవలసిందే. ఎందుకంటే ఆ తరువాత రామ్ చేయబోయేది పాన్ ఇండియా మూవీ.

ఇక కొంతకాలంగా నితిన్ కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ‘భీష్మ’ తరువాత ఇంతవరకూ ఆయనకి హిట్ లేదు. అందువలన ‘మాచర్ల నియోజకవర్గం’ పైనే ఆయన ఆశలు పెట్టుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ  సినిమా, ఆగస్టు 12వ తీదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించిన  ఈ సినిమాలోను కథానాయిక కృతి శెట్టినే. గ్రామీణ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ కథ తనకి తప్పకుండా హిట్ తెచ్చి పెడుతుందనే నమ్మకంతో నితిన్ ఉన్నాడు.

ఇక ఆగస్టు 25వ తేదీనే విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఆడియన్స్ ముందుకు రానుంది. పూరి దర్శకత్వం వహించిన ఈ  సినిమాతో అనన్య పాండే తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాకి ముందు విజయ్ దేవరకొండ చేసిన ‘డియర్ కామ్రేడ్’ .. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. అంతేకాదు చాలా గ్యాప్ కూడా వచ్చేసింది. అందువలన ‘లైగర్’ గట్టి హిట్టు కొట్టవలసి ఉంటుంది. ఇక నిఖిల్ కూడా ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. ఆగస్టులో ‘కార్తికేయ 2’తో వస్తున్న ఆయనకి కూడా హిట్టు చాలా అవసరమే. మరి థియేటర్ల ఎవరు ఎలాంటి రిజల్టును రాబడతారనేది చూడాలి.

Also Read :‘ది వారియర్’తో కోలీవుడ్ తెరకి కోలకళ్ల పిల్ల! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్