Thursday, April 3, 2025
Homeసినిమావర్మ రాజకీయ చిత్రం ‘వ్యూహం’

వర్మ రాజకీయ చిత్రం ‘వ్యూహం’

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు.. ఎవరి గురించి ట్వీట్ చేస్తాడో.. ఎప్పుడు ఎవరి గురించి సినిమా తీస్తాడో మనకే కాదు.. ఆయనకు కూడా తెలియదు. ఆలోచన రావడమే ఆలస్యం వెంటనే సినిమాని అనౌన్స్ చేస్తాడు. ఆ వెంటనే షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. దటీజ్ రామ్ గోపాల్ వర్మ. ఇప్పటి వరకు ఎన్నో రాజకీయ చిత్రాలు తీసిన వర్మ ఇప్పుడు ఓ రాజకీయ చిత్రం తీస్తున్నారు. అదే… ‘వ్యూహం’. ఈ సినిమా గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వర్మ అఫిషియల్ గా అనౌన్స్ చేశాడు.

ఇంతకీ వర్మ ఏమన్నారంటే… ‘నేను అతి త్వరలో ‘వ్యూహం’ అనే రాజకీయ సినిమా తీయబోతున్నాను. ఇది బయోపిక్‌ కాదు.. బయోపిక్‌ కన్నా లోతైన రియల్‌ పిక్‌. బయోపిక్‌లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్‌ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి..’’ అంటూ రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల ఓ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇందులో జగన్‌ పాత్రలో అజ్మల్‌, భారతి పాత్రలో మానస నటించనున్నారు. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్‌ పతాకం పై దాసరి కిరణ్‌ నిర్మిస్తున్నారు. త్వరలో ఇతర వివరాలను ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్