Saturday, January 18, 2025
Homeసినిమాచిరు, పూరి కాంబో పై వ‌ర్మ కామెంట్స్

చిరు, పూరి కాంబో పై వ‌ర్మ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి,  డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో మూవీ గురించి గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్ కాలేదు. ‘ఆటోజానీ’ అనే టైటిల్ తో చిరంజీవితో పూరి సినిమా చేయాలి అనుకున్నారు. క‌థా చ‌ర్చ‌లు జ‌రిగాయి కానీ సెకండాఫ్ స‌రిగా లేద‌ని చిరు సున్నితంగా తిర‌స్క‌రించారు. అయితే.. ఇటీవ‌ల చిరును పూరి ఇంట‌ర్ వ్యూ చేశారు.

ఈ ఇంట‌ర్ వ్యూలో ‘ఆటోజానీ’ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. దీనికి పూరి.. ఆటోజానీ స్టోరీని చింపేశాను. మీ కోసం ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాను అని చెప్పారు. దీనికి చిరంజీవి పాజిటివ్ గా స్పందించారు. దీంతో ఈ క్రేజీ కాంబో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.
పూరి తన హీరోలను చాలా పవర్ ఫుల్ గా, చాలా స్పెషల్ గా చూపిస్తారు. మెగాస్టార్ ను అలా చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడు ఈ కాంబో పై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించ‌డం ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ వ‌ర్మ ఏం చెప్పారంటే.. ఇద్దరు ప్యాషన్‌ తో కూడిన సినిమా వ్యక్తుల సమ్మేళనం అని ఆయన ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో ఈ కాంబో సెట్ అవ్వ‌డం ఖాయం అని టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఇదే క‌నుక జ‌రిగితే మెగా అభిమానుల‌కు పండ‌గే.

Also Read : చిరు, పూరి కాంబో మూవీ ఫిక్స్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్