Saturday, January 18, 2025
Homeసినిమారాం గోపాల్ వర్మ 'వ్యూహం' ఏమిటో?

రాం గోపాల్ వర్మ ‘వ్యూహం’ ఏమిటో?

సంచలన, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయ నేపథ్యంతో కూడిన సినిమాను రూపొందించనున్నారు. దీనికి ‘వ్యూహం’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. వర్మ నిన్న తాడేపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. వారి మధ్య జరిగిన చర్చల సందర్భంగా కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రస్తావన వచ్చినట్లు చెబుతున్నారు.  కొత్త సినిమాపై వర్మ నేడు ఓ ప్రకటన విడుదల చేశారు.

“అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది .

రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం. ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం”, 2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.

రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం”లో తగులుతుంది. “వ్యూహం “ చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ .

ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ఏం చెప్పాలో , ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు, కనక చెప్పట్లేదు. ఇట్లు మీ భవదీయుడు…. రామ్ గోపాల్ వర్మ”  అంటూ ప్రకటన చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్