Sunday, March 8, 2026
Homeసినిమారామ్ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు.?

రామ్ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు.?

ఎనర్జిటిక్ హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాడు.. బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఆతర్వాత రామ్ చేసిన సినిమా రెడ్. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్ధాయిలో మెప్పించలేదు. ఆ తర్వాత చాలా కథలు విని ఆఖరికి తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. తెలుగు, తమిళ్ లో రూపొందే ఈ ద్విభాషా చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రలో రామ్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఈ మాస్ ఎంటర్ టైనర్ ఈపాటికే సెట్స్ మీదకి వెళ్ళాలి. అయితే.. కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. ప్రస్తుతం పరిస్థితులు కాస్త అదుపులోకి వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం వచ్చే నెల నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీతో మాస్ ని మెప్పించిన ఈ ఎనర్జిటిక్ హీరో రామ్.. మరోసారి మాస్ ని మెప్పించే కథతో ఈ సినిమా చేస్తున్నారు. మరి.. ఈ ద్విభాషా చిత్రంతో రామ్ మరో బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular