Friday, September 20, 2024
Homeసినిమా12 నుంచి రామ్-లింగుసామి మూవీ షూటింగ్

12 నుంచి రామ్-లింగుసామి మూవీ షూటింగ్

రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా తెలుగు, తమిళ భాషల్లో ఓ పక్కా మాస్ సినిమా నిర్మిస్తున్నారు. రామ్ నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం ఇది. ‘రన్’, ‘ఆవారా’, ‘పందెంకోడి’ వంటి సూప‌ర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన లింగుసామి చేస్తున్న మొదటి స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. రామ్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించనున్నారు. ‘దృశ్యం’, ‘లూసిఫర్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఇటీవల ‘క్రాక్’ చిత్రానికి పవర్‌ఫుల్ డైలాగ్స్ రాసిన ప్రముఖ సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ఈ నెల 12 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా చిత్రనిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ… ‘‘చాలా కాలంగా రామ్‌తో సినిమా చేయాల‌ని మంచి స‌బ్జెక్ట్ కోసం చూస్తున్నాం. లింగుసామి చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ ఊర మాస్ స‌బ్జెక్ట్ మా అంద‌రికీ న‌చ్చి రామ్‌ కి వినిపించాం. క‌థ విన‌గానే ఆయ‌న కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. వెంట‌నే సినిమా చేద్దామ‌న్నారు. ఈ నెల 12న హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లవ్ సాంగ్ ట్యూన్ కంపోజ్ చేశారు. మిగతా సాంగ్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయి. త్‌ిర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాం’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్