Monday, March 16, 2026
Homeసినిమా'డబుల్ ఇస్మార్ట్' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

‘డబుల్ ఇస్మార్ట్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్‌’ లో తన పాత్ర కోసం రామ్ మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ట్రాన్స్ ఫర్మేషన్ చూపించే వీడియోలో సూపర్ స్మార్ట్ గా కనిపించారు రామ్. పూరి కనెక్ట్స్‌ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విషు రెడ్డి సీఈవో. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. భారీ సెట్‌ లో రామ్, ఫైటర్స్ ‌పై భారీ సీక్వెన్స్‌ తో టీమ్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది.

‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రం నుంచి పూరి జగన్నాధ్ తో అసోసియేట్ అవుతున్న స్టంట్ డైరెక్టర్ కేచ ఈ సీక్వెన్స్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. వర్కింగ్ స్టిల్‌లో రామ్, చేతిలో ఫైర్ వర్క్స్ పట్టుకుని ట్రక్కులో కూర్చొని కనిపించారు. పూరి, కేచ, జియానీలు కూడా చిరునవ్వుతో కనిపిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో  తెలియజేయనున్నారు మేకర్స్. డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular