Sunday, January 19, 2025
Homeసినిమారామ్ – బోయపాటిల మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్.!

రామ్ – బోయపాటిల మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్.!

రామ్, బోయపాటి కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ కు జంటగా శ్రీలీల నటిస్తుంది. తాజాగా చిత్రం టైటిల్ మేకర్స్ ప్రకటించారు.’#బోయపాటి రాపో’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ‘స్కంధ’ అనే పేరును ఖరారు చేశారు. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో రామ్ ఊరమాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు,  నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్