Sunday, January 19, 2025
Homeసినిమారామ్, బోయపాటి పాన్ ఇండియా మూవీ ప్రారంభం

రామ్, బోయపాటి పాన్ ఇండియా మూవీ ప్రారంభం

Ram-Boyapati: ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ ప్రారంభించారు. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా  ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘అఖండ’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో థియేటర్లకు మళ్ళీ పూర్వ వైభవం రావడంతో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. ఆ సినిమా తర్వాత బోయపాటి చేస్తున్న చిత్రమిది. దర్శకుడిగా ఆయన 10వ సినిమా. హీరో రామ్ 20వ సినిమా ఇది. ‘ది వారియర్’ తర్వాత రామ్ నటిస్తున్న చిత్రమిది.

హీరో రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ క్లాప్ ఇచ్చారు. చిత్ర దర్శకులు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో దర్శకులు లింగుస్వామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్ అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ… “బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. ‘ది వారియర్’ తర్వాత మా హీరో రామ్‌తో వెంటనే మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా చేయబోతున్నాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడిస్తాం” అని అన్నారు.

Also Read :   రామ్ ‘ది వారియర్’ చిత్రీకరణ పూర్తి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్