Sunday, January 19, 2025
Homeసినిమాఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చిన రామ్

ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చిన రామ్

రామ్, బోయపాటి కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేశారు కానీ.. అంతకు మించి అప్ డేట్ లేదు. అయితే.. బోయపాటి సినిమా అంటే యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని.. మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేలా తెరకెక్కిస్తారని భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి రామ్ ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఇంతకీ రామ్ ఇచ్చిన అప్ డేట్ ఏంటంటే…  యాక్షన్ సీన్ కోసం దాదాపు 24 రోజులు కష్టపడ్డాం. ఫైనల్ గా అది పూర్తయ్యిందని ఆయన చెప్పారు. కాగా ఇది క్లైమాక్స్ కాదని అంతకు మించి ఉంటుందని ఆయన చెప్పడం విశేషం.

ఈ ట్వీట్ ఇప్పుడు రామ్ ఫ్యాన్స్ కి కూడా ఎనర్జీ తెప్పించింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. కాగా ఈ మూవీలో ఊర్వశీ రౌతెలా ఓ స్పెషల్ సాంగ్ చేసినట్లు సమాచారం. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రేజీ మూవీని దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత రామ్.. పూరితో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ చేయనున్నారు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కాబట్టి అంచనాలకు తగ్గట్టుగా కథను రెడీ చేస్తున్నారు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు నుంచి సెట్స్ పైకి తీసుకురానున్నారు. ముంబాయిలో హైదరాబాద్ సెట్ వేసి షూటింగ్ చేయాలనేది పూరి ప్లాన్. బోయపాటితో చేస్తున్న తర్వాత సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉంటాయి. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా అంతకు మించి అనేలా కథను పూరి రెడీ చేస్తున్నారట.

RELATED ARTICLES

Most Popular

న్యూస్