Friday, November 22, 2024
HomeసినిమాPuri Jagannadh: పూరి నెక్ట్స్ మూవీ వెనుక ఏం జరిగింది..?

Puri Jagannadh: పూరి నెక్ట్స్ మూవీ వెనుక ఏం జరిగింది..?

పూరి జగన్నాథ్ లైగర్ మూవీ డిజాస్టర్ అయ్యింది. సెట్స్ పై ఉన్న జనగణమన ఆగిపోయింది. దీంతో ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. చిరంజీవితో పూరి సినిమా, బాలకృష్ణతో పూరి సినిమా అని వార్తలు వచ్చాయి కానీ.. ఏదీ కన్ ఫర్మ్ కాలేదు. అయితే.. గత కొన్ని రోజులుగా విశ్వక్ సేన్ తో పూరి సినిమా ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరిగింది. రెండు రోజుల నుంచి విశ్వక్ సేన్ తో మూవీకి ముహుర్తం కుదరింది. ఆగష్టు నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురానున్నారని వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు పూరి మూవీ కన్ ఫర్మ్ అయ్యింది అనుకుంటే… విశ్వక్ సేన్ అలాంటిది ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చాడు.

గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ గురించి వస్తున్న వార్తలను చూస్తున్నాను. అసలు పూరి సర్ ని కలవలేదు. ఈ ప్రాజెక్ట్ లేదు అని చెప్పాడు. దీంతో మళ్లీ పూరి సినిమా ఎవరితో అనేది మొదటికి వచ్చింది. అసలు ఏం జరిగిందని ఆరా తీస్తే.. తెలిసింది ఏంటంటే.. పూరి జగన్నాథ్ నెక్ట్స్ మూవీని రామ్ తో చేయాలని ఫిక్స్ అయ్యారట. ప్రాధమిక చర్చలు పూర్తయ్యాయని… మూవీ కన్ ఫర్మ్ అయ్యిందని తెలిసింది. ప్రస్తుతం రామ్ బోయపాటితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను దసరాకి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత రామ్, పూరితో సినిమా చేయనున్నారు. స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారు. అయితే.. పూరి ఫ్లాప్ మూవీ తీసినా ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు.. నటించేందుకు హీరోలు.. చూసేందుకు జనాలు ఎప్పుడూ రెడీనే. ఇంకా చెప్పాలంటే.. పూరి ప్లాప్ ఇచ్చినా ఆయన సినిమాలు చూడడానికి యూత్ బాగా ఇష్టపడుతుంటారు. అయితే… ఈసారి పూరి సినిమా కాస్త ఆలస్యం అవుతుంది. మరి… పూరి కసితో ఈసారి బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్