Sunday, January 19, 2025
HomeసినిమాRama Banam Trailer: 'రామబాణం' ట్రైలర్ విడుదల

Rama Banam Trailer: ‘రామబాణం’ ట్రైలర్ విడుదల

గోపీచంద్, శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఐఫోన్, దరువెయ్యరా పాటలు చార్ట్ బస్టర్స్ గా అలరించాయి. రాజమండ్రిలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్  సినిమా ప్లాట్ లైన్ ని రివిల్ చేసింది.

“ఈ క్షణం, ఈ ప్రయాణం.. నేను ఊహించినది కాదు, ప్లాన్ చేసింది కాదు’ అని గోపీచంద్ వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైయింది. డింపుల్ హయాతి కోల్‌కతా నుంచి వ్లాగర్‌గా పరిచయం అయ్యింది. లవ్ ట్రాక్ యూత్ ఆకట్టుకుంటుంది. తర్వాత జగపతి బాబు ఆరోగ్యకరమైన ఆహరం, ఆరోగ్యకరమైన బంధాలు ప్రాముఖ్యత గురించి చెబుతూ గోపీచంద్ సోదరుడిగా ఎంట్రీ ఇచ్చారు.

జగపతి బాబు మంచి ఉద్దేశం..  కార్పొరేట్ మాఫియా రూపంలో అతనకి కుటుంబానికి కష్టాలు తెచ్చిపెడుతుంది. ఇద్దరు బ్రదర్స్ కలిసి వారితో ఎలా పోరాడుతారు అనేది కీలకాంశం.

డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో గోపీచంద్ అద్భుతంగా నటించారు. అతని స్టంట్స్ మాస్‌ని ఆకట్టుకున్నాయి. తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. జగపతి బాబు ఎప్పటిలానే హుందాగా కనిపించారు. డింపుల్ హయాతి గ్లామర్ విందు ఇచ్చింది. ఖుష్బు మరో అసెట్. వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరుల కావల్సినంత వినోదాన్ని పంచారు.సమ్మర్ కానుకగా మే 5న ‘రామబాణం’ విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్