Sunday, January 19, 2025
HomeTrending Newsఅది విద్యాదీవెన కాదు, దగా: రామానాయుడు

అది విద్యాదీవెన కాదు, దగా: రామానాయుడు

రాష్ట్రంలో 20 ఏళ్ళ నుంచి ఫీజు రీ ఇంబర్స్ మెంట్ పథకం అమల్లో ఉందని, జగన్ సిఎం అయిన తరువాత దాన్ని నాలుగు ముక్కలు చేసి అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. జగన్ అమలు చేస్తున్నది  విద్యా కానుక కాదని, విద్యా దగా అని పేర్కొన్నారు. గతంలో ఫీజు మొత్తాన్నీ ఒకే సారి కాలేజీలకు నేరుగా చెల్లించే విధానం ఉండేదని, కానీ జగన్ మాత్రం దాన్ని నాలుగు ఇన్ స్టాల్ మెంట్లుగా, తల్లుల అకౌంట్లలో వేస్తున్నారని చెప్పారు.  సాధారణంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకానికి అర్హులేనని, కానీ జగన్ ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యలో కోత పెడుతున్నారని రామానాయుడు ఆరోపించారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 16లక్షల మందికి ఫీజు రీఇంబర్స్ మెంట్ అందితే ఇప్పుడు 11  లక్షల మందికే ఇస్తున్నారని, ఐదు లక్షల మంది విద్యార్ధులు నష్టపోతున్నారని చెప్పారు. వీరిలో ఎక్కువ భాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులే ఉన్నారని అయన వాపోయారు.

రాష్ట్రంలో చాలా మంది విద్యార్ధులు ఫీజులు  చెల్లించలేక, ప్రభుత్వం నుంచి రీఇంబర్స్ మెంట్ రాక చదువులు మధ్యలో ఆపేస్తున్నారని తెలిపారు.

తన నియోజకవర్గం పాలకొల్లులోని ఒక వార్డులో ఓ విద్యార్ధి ఫీజు ఆపేశారని, దీనిపై ఆరా తీస్తే అతని సోదరుడికి గ్రామ సచివాలయంలో ఉద్యోగం వచ్చిందని, ఆ కారణంగా ఆపేశారని వివరించారు.  షుమారు మూడు లక్షల రూపాయల ఫీజు చెల్లించలేక, విధిలేని పరిస్థితుల్లో ఆ విద్యార్ధి తన తండ్రితో పాటు ఇనుప సామాన్ల కొట్టులో పని చేసుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు లక్షల సంఖ్యలో ఉన్నాయని రామానాయుడు చెప్పారు.

Also Read విద్యతోనే పేదరికం జయించాలి: సిఎం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్