Saturday, March 14, 2026
Homeసినిమామార్చి25న ‘రామారావు ఆన్ డ్యూటీ’

మార్చి25న ‘రామారావు ఆన్ డ్యూటీ’

Ramarao On Duty:
మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీక్వెన్స్‌ లు తెరకెక్కిస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాను మార్చి 25, 2022న విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది, మార్చి చివరి వారం నుంచి సమ్మర్ సీజన్ మొదలవుతుంది. సమ్మర్ రేసులో రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’తో బరిలోకి దిగబోతోన్నారు.

రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. రైతులు, పోలీస్ అధికారులు కూడా ఈ పోస్టర్‌లో చూడొచ్చు. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా… సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది. ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన తరువాత ప్రమోషన్స్‌ జోరు పెంచాలని చిత్రయూనిట్ భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular