సునీల్, సుక్రాంత్ వీరెల్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కనబడుటలేదు’. బాలరాజు ఎం దర్శకత్వంలో ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ బ్యానర్స్ పై సాగర్ మంచనూరు, సతీశ్ రాజు, దిలీప్ కూరపాటి, డా.శ్రీనివాస్ కిషన్ అనపు, దేవీ ప్రసాద్ బలివాడ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఆగస్ట్ 13న విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బిగ్ టిక్కెట్టును ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “కనపడుట లేదు అనే టైటిల్ నన్నెంతగానో ఇన్‌స్పైర్ చేసింది“ అన్నారు.
డైరెక్టర్ బాలరాజు ఎం మాట్లాడుతూ.. “నాకు సినిమాలంటే పిచ్చి ఏర్పడటానికి కారణం రామ్‌గోపాల్ వర్మ గారు. ఆయన సినిమాలు చూసి సినిమా అంటే ఇష్టం ఏర్పడింది. ఇంటర్నేషనల్ మేకింగ్‌ను, సౌండింగ్‌ను మన సినిమాలకు పరిచయం చేసిన తొలి దర్శకుడాయన. అలాగే మన సినిమాలను ఇంటర్నేషనల్ స్థాయికి కథల రూపంలో పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మన స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ గారే. సక్సెస్‌ఫుల్ సినిమాలు తీస్తేనే సక్సెస్ ఏమో అనుకున్నాను. కానీ.. ఓ సినిమాను సక్సెస్‌ఫుల్‌గా తీస్తేనే సక్సెస్ అని నేను ఈరోజు అనుకుంటున్నాను. నన్ను భరించి, ప్రేమించి నాతో నడిచిన నా టీమ్‌కు థాంక్స్. థియేటర్లలో ఈ ఆగస్ట్ 13న విడుదలవుతున్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ..`కనబడుటలేదు` చాలా బాగా కనబడుతుంది. కొత్త దర్శకుడిలా బాలరాజు కనపడటం లేదు. తనెందుకు ఈ టైటిల్ పెట్టాడనేది సినిమా చూడాల్సిందే. స్పార్క్ సాగర్ లాంటి నిర్మాత దొరకడం ఈ టీమ్‌కు అదృష్టం. ఎందుకంటే.. తను ఓసారి కమిట్‌మెంట్ ఇస్తే.. తర్వాత తన మాట తను కూడా వినడు. వైశాలిరాజ్ చాలా మంచి నటి. తనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సుక్రాంత్ బాగా యాక్ట్ చేశాడు. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్“ అన్నారు