Saturday, January 18, 2025
HomeసినిమాBook My Show Skanda: బుక్ మై షోలో రికార్డ్ క్రియేట్ చేసిన 'స్కంద'

Book My Show Skanda: బుక్ మై షోలో రికార్డ్ క్రియేట్ చేసిన ‘స్కంద’

రామ్ నటించిన తాజా చిత్రం ‘స్కంద’. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను డైరెక్టర్. చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ భారీ పాన్ ఇండియామూవీలో రామ్ కు జంటగా శ్రీలీల నటించింది. ఈ మూవీ సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల బాలయ్య చేతుల మీదుగా రిలీజైన ట్రైలర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. 28కి వాయిదా వేశారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ కాకుండా రికార్డు క్రియేట్ చేసింది. విషయం ఏంటంటే.. బుక్ మై షోలో స్కంద సినిమాను చూసేందుకు 100కే ఇంట్రస్ట్ చూపించినట్టుగా తెలిసింది. దీనిని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ పుష్ప 2, సలార్ చిత్రాలు మాత్రమే ఈ రేర్ ఫీట్ ని అందుకున్నాయి. ఆ రెండు సినిమాల తర్వా బుక్ మై షోలో ఈ రికార్డ్ ను స్కంద సొంతం చేసుకోవడం విశేషం. రామ్, బోయపాటి, శ్రీలీల, నిర్మాత చిట్టూరి శ్రీనివాస్.. ఈ నలుగురుకి ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో స్కంద సినిమాతో ఎంత వరకు మెప్పిస్తారు..? బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేయనుంది అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్