Sunday, January 19, 2025
Homeసినిమామహేష్ మూవీలో రమ్యకృష్ణ

మహేష్ మూవీలో రమ్యకృష్ణ

త్రివిక్రమ్ శ్రీనివాస్.. తన ప్రతి సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ కోసం కీలక పాత్ర రాస్తుంటారు. ఇది ఆయనకు అలవాటుగా మారింది. అత్తారింటికి దారేది చిత్రంలో సీనియర్ హీరోయిన్ నదియాతో కీలక పాత్ర చేయించారు. ఆమెకు ఎంతో గుర్తింపు, పేరు తీసుకువచ్చాయి. ఈ సినిమాతో నదియా మళ్లీ బిజీ అయ్యారు. ఇక ‘అజ్ఞాతవాసి’లో సీనియర్ హీరోయిన్ ఖుష్బూతో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. అలాగే అల.. వైకుంఠపురములో సీనియర్ హీరోయిన్ టబుతో ముఖ్యపాత్ర చేయించారు.

ఇలా.. తన సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ తో కీలక పాత్రలు చేయించి మళ్లీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తున్న త్రివిక్రమ్ ఈసారి మహేష్ బాబు మూవీలో రమ్యకృష్ణతో ఓ కీలక పాత్ర చేయించాలి అనుకుంటున్నారట. మహేష్‌ బాబు, రమ్యకృష్ణ కలిసి నటిస్తే చూడాలని చాలా మందికి ఉంది. ఈ మూవీతో అది నెరవేరబోతుంది. నిజానికి ఈ సినిమా కోసం రమ్యకృష్ణను చాన్నాళ్ల కిందటే కాంటాక్ట్ చేశారు త్రివిక్రమ్. అయితే.. అప్పట్లో రమ్యకృష్ణ అంతగా ఆసక్తి చూపించలేదట కానీ.. ఇప్పుడు ఈ మూవీలో నటించేందుకు ఓకే చెప్పిందని సమాచారం.

ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ బంగ్లా సెట్ వేశారు. ఇప్పుడా సెట్ రెడీ అయింది. ఈరోజు నుంచి ఆ ఇంటి సెట్ లోనే షూటింగ్ చేయనున్నారు. మేజర్ పార్ట్ షూట్ మొత్తం ఇందులోనే జరగనుంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు.  అయితే.. ఈ సినిమాలో మహేష్ బాబు, రమ్యకృష్ణ మధ్య ఉండే రిలేషన్ ఏంటి అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్