సూపర్ స్టార్ రజినీకాంత్ వరుసగా ఫ్లాపులతో సతమతమౌతున్న టైమ్ లో జైలర్ వచ్చింది. ఈ సినిమా పై రజినీ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆశించినట్టుగానే జైలర్ పెద్ద సక్సెస్ అయ్యింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా పెద్ద విజయం సాధించడంతో రజినీకాంత్ నెక్ట్స్ చేసే సినిమాల పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ‘లాల్ సలామ్’ అనే సినిమా చేస్తున్నారు. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో రూపొందుతోన్న లాల్ సలామ్ మూవీని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జైలర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది. లాల్ సలామ్ తర్వాత రజినీకాంత్.. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేయనున్నారు.
ఈ చిత్రంలో రితికా సింగ్, దుషారా విజయన్, మంజు వారియర్ ను ఎంపిక చేసినట్టుగా మేకర్స్ ప్రకటించారు. అయితే.. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం నానిని కాంటాక్ట్ చేస్తే.. నో చెప్పాడని వార్తలు వచ్చాయి. ఆతర్వాత అదే పాత్ర కోసం శర్వానంద్ ను కాంటాక్ట్ చేస్తే.. శర్వా కూడా నో చెప్పాడని టాక్ వచ్చింది. నాని, శర్వా నో చెప్పిన పాత్ర కోసం రానా దగ్గుబాటిని సంప్రదించారని తెలిసింది. అయితే.. ఈ వార్తలు నిజం కాదేమో.. పుకారేమో అనుకున్నారు కానీ.. ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ మేకర్స్ ఈ చిత్రంలో రానా దగ్గుబాటి నటిస్తున్నట్టుగా ప్రకటించారు.
మరో విషయం ఏంటంటే.. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి యువ సంగీత సంచలనం అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు. భారీ తారాగణంతో.. బారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండడంతో ఇప్పటి నుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. నాని, శర్వా ఈ చిత్రంలో నటించేందుకు ఎందుకు నో చెప్పారు. పాత్ర నచ్చలేదా..? వేరే కారణం ఏదైనా ఉందా..? మరి.. రానా ఎందుకు ఓకే చెప్పారు. ఈ సినిమా గురించి నాని, శర్వా తీసుకున్న నిర్ణయం కరెక్టా..? రానా దగ్గుబాటి నిర్ణయం కరెక్టా..? అనేది ఆసక్తిగా మారింది. అసలు విషయం తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.