Sunday, January 19, 2025
HomeసినిమాDaggubati Rana: రజినీకాంత్ మూవీలో దగ్గుబాటి రానా

Daggubati Rana: రజినీకాంత్ మూవీలో దగ్గుబాటి రానా

రజినీకాంత్ ‘జైలర్’ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా తమిళ్ లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తదుపరి చిత్రాన్ని జై భీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తో చేయనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 19 నుండి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ ముస్లిం పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జైలర్ సక్సెస్ తర్వాత రజినీ చేస్తున్న మూవీ కావడంతో ఇంకా స్టార్ట్ కాకుండానే ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే.. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నాని ఓ ముఖ్యపాత్ర పోషించనున్నట్టుగా టాక్ వచ్చింది. ఆతర్వాత నాని కాదు.. శర్వానంద్ ఈ సినిమాలో నటించనున్నట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు నాని కాదు.. శర్వా కాదు.. భళ్లాలదేవ.. దగ్గుబాటి రానా నటిస్తారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. దీనికి సంబంధించి అఫిషియల్ గా ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజం అవుతుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్