Tuesday, March 17, 2026
Homeసినిమాఓ పాట మినహా ‘రంగ రంగ వైభవంగా’ పూర్తి

ఓ పాట మినహా ‘రంగ రంగ వైభవంగా’ పూర్తి

wrapped except one song: ‘ఉప్పెన’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. కేతికాశ‌ర్మ హీరోయిన్‌. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఒక సాంగ్ మిన‌హా సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. సినిమా ఔట్‌పుట్ పై మేక‌ర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

ల‌వ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిసిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మయ్యాయి. రీసెంట్‌గా విడుద‌లైన టైటిల్ టీజ‌ర్‌, పాట‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాకు మేజ‌ర్ హైలైట్‌గా నిలుస్తుంది అంటున్నారు మేక‌ర్స్. శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular