Saturday, January 18, 2025
HomeTrending Newsఅంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు

అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు

Rare Recognition For The State Of Telangana At The International Level :

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించిన ఐక్యరాజ్య సమితి – అంతర్జాతీయ ఆహార సంస్థ (FAO), వ్యవసాయ & విత్తన రంగ అభివృద్ధ్యే లక్ష్యంగా నవంబర్ 4 & 5, 2021 తేదీలలో విత్తన పరిశ్రమల సమగ్ర అభివృద్దిపై రోమ్ లో  “అంతర్జాతీయ విత్తన సదస్సు” నిర్వహించనున్న FAO. ఈ సంధర్భంగా “A Success Story of India : Telangana State as a Global Seed Hub” అనే అంశంపై ప్రసంగించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం పంపిన FAO, ప్రభుత్వం తరపున ప్రసంగించనున్న విత్తన సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా. కేశవులు.

దాదాపు 195 ప్రపంచ దేశాలకు చెందిన మంత్రులు, FAO ప్రతినిధులు, విత్తన ప్రముఖులు, శాస్త్రవేత్తలు, విత్తన పరిశ్రమల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం యొక్క విత్తన ఖ్యాతి అంతర్జాతీయ బాషలైన ఇంగ్లిష్, స్పానిష్, ఫ్రెంచ్ భాషలలొ ప్రసారం కానున్నాయి. అంతర్జాతీయ విత్తన భాండాగారంగా గుర్తింపు పొందిన తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి ఉన్న మౌలిక వసతులు, అవకాశాలు, విత్తన పరిశ్రమ సామర్థ్యం మరియు విత్తన రంగ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సీడ్ బౌల్ కార్యక్రమాలపై వివరణ ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రం నుంచి మరిన్ని విత్తన ఎగుమతులు ప్రోత్సహించి, విత్తన రంగ అభివృద్దిని & విత్తన వాణిజ్యాన్ని మరింత పెంపొందించి, ప్రపంచ విత్తన పటంలో తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగాన నిలవటానికి ఇది ఎంతగానో దోహదపడనున్నది. తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థను, ఎండీ కేశవులును అభినందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి దక్కిన అరుదైన గౌరవం గుర్తింపుగా మంత్రి నిరంజన్ రెడ్డి అభివర్ణించారు.

Must Read :తెలంగాణ ఫ్రాన్స్ డిజిటల్ పార్టనర్ షిప్

RELATED ARTICLES

Most Popular

న్యూస్