Friday, March 20, 2026
HomeసినిమాRasha Thadani: చరణ్‌ కు జంటగా జాన్వీ కాదా..?

Rasha Thadani: చరణ్‌ కు జంటగా జాన్వీ కాదా..?

రామ్ చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి శంకర్ డైరెక్టర్. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇండియన్ 2 వలన ఎప్పుడు విడుదల కానుందో క్లారిటీ లేని పరిస్థితి. ఈ మూవీ ఈ ఇయర్ లో కాదు.. నెక్ట్స్ ఇయర్ లో కాదు.. ఆతర్వాత అంటే… 2025లో గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతాదేమో అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే.. ఈ సినిమా ఇలా ఆలస్యం అవుతుండడంతో నెక్ట్స్ మూవీని సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారట. చరణ్ నెక్ట్స్ మూవీని ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్థి సినిమాస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో చరణ్‌ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ నటించనుందని ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత జాన్వీ చేసే సినిమా ఇదే అంటూ వార్లు వచ్చాయి. ఇప్పుడు మరో కథానాయిక పేరు ప్రచారంలోకి వచ్చింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ కథానాయికగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే హిందీలో ఓ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. ఇప్పుడు చరణ్ మూవీలో నటించేందుకు ఫైనల్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ వచ్చిందని.. ఫోటో సెషన్ కూడా అయ్యిందని టాక్. ఆమె ఫోటోలు బయటకు రావడం.. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు క్యూట్ గా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం వైరల్ అయ్యింది. మరి.. ఈ క్యూటీనే ఫిక్స్ చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular