Thursday, March 12, 2026
HomeTrending Newsదుల్కర్ మూవీలో రష్మిక పాత్ర లుక్ విడుదల

దుల్కర్ మూవీలో రష్మిక పాత్ర లుక్ విడుదల

Rashmika: హృదయాన్ని హత్తుకునే రొమాంటిక్ ఎంటర్ టైనర్‌ లను రూపొందించడంలో పేరుగాంచిన దర్శకుడు హను రాఘవపూడి. ప్రస్తుతం హీరో దుల్కర్ సల్మాన్ ను అదే తరహా చిత్రంలో లెఫ్టినెంట్’ రామ్ గా చూపించబోతున్నాడు. మృణాళిని ఠాకూర్ అతనికి జోడీగా సీత పాత్ర లో కనిపించనుంది. వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా పతాకం పై అశ్వినీదత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రష్మిక, పుట్టినరోజు సందర్భంగా నేడు రష్మిక మందన్నను ప్రాజెక్ట్‌ లో భాగమని వెల్లడించడం ద్వారా మేకర్స్ పెద్ద సర్ప్రైజ్ చేసారు. అంతేకాదు, ఇది ఆమెకు రెగ్యులర్ పాత్ర కాదు. ఆమె అఫ్రీన్ అనే కాశ్మీరీ ముస్లిం అమ్మాయి గా వీరోచిత పాత్రలో కనిపిస్తుంది. పాత్రను పరిచయం చేసే గ్లింప్స్ లో రష్మిక మందన్న కాలిపోతున్న కారు ముందు నడుస్తూ ఉంటుంది. ఆమె ఎరుపు రంగు హిజాబ్ ధరించి, హ్యాండ్‌బ్యాగ్‌ ని కలిగి, ఆమె కళ్లలోని సీరియస్ నెస్, తీవ్రతను స్పష్టం చేస్తుంది.

విశాల్‌ చంద్రశేఖర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆ పాత్రను ఆకట్టుకునేలా చేసింది. స్వప్న సినిమా ప్రొడక్షన్ నెం 7 గా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. దుల్కర్, మృణాళిని పాత్రలను పరిచయం చేయడానికి ఫస్ట్ లుక్,  గ్లింప్స్ లు చిత్రం పై చాలా ఆసక్తి కలిగించగా, రష్మిక మందన్న గ్లింప్స్ చిత్రం పై అంచనాలను మరింత పెంచింది. భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

Also Read :ఎన్టీఆర్ జోడీ కడుతున్న రష్మిక? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular