Saturday, January 18, 2025
Homeసినిమాస్పిరిట్ లో ప్రభాస్ సరసన ఎవరు?

స్పిరిట్ లో ప్రభాస్ సరసన ఎవరు?

Who’s to fix: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఆదిపురుష్ మూవీతో సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఆత‌ర్వాత స‌లార్ సినిమా రిలీజ్ కానుంది. అలాగే మారుతితో సినిమా కూడా ప్లానింగ్ లో ఉంది. అయితే.. ఈ సినిమాల గురించి ఏదో వార్త బ‌య‌ట‌కు వ‌స్తుంది కానీ స్పిరిట్ సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్ డేట్ లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ స్పిరిట్ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు.

ఇది ప్ర‌భాస్ 25వ చిత్రం. ఈ సినిమాని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు కానీ.. ఆత‌ర్వాత నుంచి ఎలాంటి అప్ డేట్ ఇవ్వ‌లేదు. ప్ర‌స్తుతం సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో యానిమ‌ల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ర‌ణ‌భీర్ క‌పూర్ న‌టిస్తున్నారు. క‌థానాయిక‌గా క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక న‌టిస్తోంది. ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. స్పిరిట్ గురించి అఫిషియ‌ల్ న్యూస్ రాక‌పోయినా ఓ వార్త మాత్రం ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

అది ఏంటంటే.. స్పిరిట్ లో హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీ, రష్మికలు పోటీ పడుతున్నారు అంటూ ప్రచారం జ‌రుగుతుంది. హిందీలో రీమేక్ చేసిన‌ అర్జున్ రెడ్డిలో కియారా నటించింది.  ప్రస్తుతం యానిమల్ లో రష్మిక మందన్నా నటిస్తోతోంది. కనుక వారిద్దరిలో ఒకరిని స్పిరిట్ సినిమా కోసం ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మ‌రి.. సందీప్ ఎవ‌ర్ని ఫైన‌ల్ చేస్తారో.. ప్ర‌భాస్ స‌ర‌స‌న ఓ బ్యూటీ న‌టిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read మరింత లేటుగా మారుతూ-ప్రభాస్ మూవీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్