Sunday, January 19, 2025
Homeసినిమాతన అసిస్టెంట్ పెళ్లికి హాజరైన రష్మిక మందన్న

తన అసిస్టెంట్ పెళ్లికి హాజరైన రష్మిక మందన్న

సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ నేషనల్ క్రష్ ఇమేజ్ తో తనదైన ఇమేజ్ సొంతం చేసుకున్న శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న. రీసెంట్ గా బహుదూర్ పల్లి, హైదరాబాద్ లోజరిగిన తన అసిస్టెంట్ సాయి పెళ్లికి రష్మిక హాజరయ్యారు. ఆమె రాకతో అక్కడున్న వారు ఆనందంతో పొంగిపోయారు. నూతన జంటను ఆశీర్వదించారు రష్మిక. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రష్మిక హీరోయిన్ గా నటించిన యానిమల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇందులో రణ్ భీర్ కపూర్ హీరో. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన సందీప్ వంగా దర్శకత్వం వచించైనా  ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2లోనూ ఆమె నటిస్తున్నారు. వెర్సటైల్ స్టార్ ధనుష్, శేఖర్ కమ్ముల మూవీలోనూ రష్మిక నటిస్తున్నారు. వీటితో పాటు రష్మిక ప్రధాన పాత్రలో రెయిన్ బో అనే సినిమా కూడా రూపొందుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్