Sunday, January 19, 2025
HomeసినిమాRashmika Mandanna: ఆ హీరోల జోడీగా జోరు పెంచుతున్న రష్మిక!

Rashmika Mandanna: ఆ హీరోల జోడీగా జోరు పెంచుతున్న రష్మిక!

టాలీవుడ్ టాప్ త్రీ హీరోయిన్స్ లో ఒకరిగా రష్మిక కనిపిస్తుంది. తొలి సినిమా ‘ఛలో’తోనే హిట్ కొట్టిన ఆమె, అప్పటి నుంచి అదే దూకుడును కొనసాగిస్తూ వెళుతోంది. అడపా దడపా ఫ్లాపులు పడినప్పటికీ, ఆ వెంటనే హిట్ కొట్టేస్తూ కెరియర్ గాడి తప్పకుండా చూసుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ ప్రాజక్టులను బ్యాలెన్స్ చేస్తోంది.  అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గానే చక్రం తిప్పేస్తోంది.

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాతో పడిన ఫ్లాప్ ను,రష్మిక ఆ వెంటనే ‘సీతారామం’ హిట్ తో లెక్కలు సరిచేసింది. తెలుగులో ఆమె తాజా చిత్రంగా ‘పుష్ప 2’ సినిమా రూపొందుతోంది. ఫస్టు పార్టు సంచలన విజయాన్ని సాధించడం వలన, సెకండాఫ్ పై సహజంగానే అంచానాలు ఉన్నాయి. ఈ సినిమా తనకి పాన్ ఇండియా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆమె ఉంది. శ్రీవల్లీ పాత్రలో మరోసారి ఆమె చేయనున్న అందాల సందడిని చూడటానికి అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు.

ఇక ఆ తరువాత సినిమా కోసం ఆమె నితిన్ తో జోడీ కడుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా చిత్రీకరణను జరుపుకుంటోంది. గతంలో ఈ ముగ్గురి కలయికలో వచ్చిన ‘భీష్మ’ భారీ విజయాన్ని అందుకుంది. అందువలన ఈ హిట్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ‘భీష్మ’ తరహాలోనే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్, విజయ్ దేవరకొండతో ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ కథానాయిగా రష్మిక పేరునే వినిపిస్తోంది. ఇలా ఆల్రెడీ ఒకసారి హిట్ అందుకున్న హీరోలతోనే కలిసి నటించే ఛాన్స్ రావడం రష్మిక అదృష్టమేనని చెప్పాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్