Friday, March 20, 2026
Homeసినిమావిజయ్ గురించి అసలు విషయం బయటపెట్టిన రష్మిక

విజయ్ గురించి అసలు విషయం బయటపెట్టిన రష్మిక

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా ‘గీత గోవిందం’ సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆతర్వాత ‘డియర్ కామ్రేడ్’ మూవీ చేశారు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు కానీ.. వీరిద్దరి మధ్య అనుబంధం మాత్రం బాగా పెరిగింది. అంతే కాకుండా.. విజయ్ ఫ్యామిలీకి రష్మిక చాలా దగ్గర అయ్యింది. విజయ్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా రష్మిక హాజరయ్యేది. అలాగే విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఏ సినిమా చేసినా ఆ సినిమాను ప్రమోట్ చేసేది.

దీంతో వీరిద్దరూ లవ్ ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల విజయ్, రష్మిక కలిసి టూర్ కి కూడా వెళ్లారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి వీరిద్దరూ లవ్ లో ఉన్నారని మరింత ప్రచారం జరిగింది. ఈ కన్నడ బ్యూటీ ఇప్పటి వరకు 17 చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే.. తాజాగా ఆమె ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ… పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని చెప్పింది. తాను స్కూల్ లో చదుకునే రోజుల్లోనే కుటుంబానికి దూరంగా హాస్టల్ లో ఉందేదానినని తెలిపింది.

తనతో పాటు హాస్టల్ లో 800 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ తనతో ఎవరూ సరిగ్గా ఉండేవారు కాదని… తాను చేయని తప్పులకు కూడా మాటలు పడేదానినని… ప్రతి రోజూ గదిలో కూర్చొని ఏడ్చేదానినని చెప్పింది. అయితే.. తన సమస్యలన్నింటినీ అమ్మతో పంచుకోవడం తనకు అలవాటని… అదే తనను స్ట్రాంగ్ గా మార్చింది అన్నది. విజయ్ తో లవ్ లో ఉన్నట్టు జరుగుతున్న వార్తల పై స్పందిస్తూ… విజయ్, తనకు మంచి ఫ్రెండ్ అని.. స్నేహితులన్నాక టూర్స్ కు వెళ్లడం సహజమని తెలిపింది. మరి.. ఇదే మాట పై ఉంటుందో.. లేక మాట మార్చి మేము లవ్ లో ఉన్నామని చెబుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular