Saturday, January 18, 2025
Homeసినిమారష్మిక చెబుతున్న ‘పుష్ప’ కబుర్లు ఏమిటో...

రష్మిక చెబుతున్న ‘పుష్ప’ కబుర్లు ఏమిటో…

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఇందులో అల్లు అర్జున్ – రష్మిక జంటగా నటిస్తున్నారు. ఆర్య, ఆర్య-2 తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది. తాజా షెడ్యూల్ ను త్వరలో స్టార్ట్ చేసి.. షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే ఈ కథలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తుంటే.. రష్మిక పల్లెటూరి అమ్మాయిగా నటిస్తుంది.

అయితే… అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న రష్మిక పుష్ప గురించి.. ఇందులో తన పాత్ర గురించి ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో మాట్లాడింది. ఇంతకీ ఏం చెప్పిందంటే.. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. పల్లెటూరి అమ్మాయిగా.. చాలా నేచురల్ గా కనిపిస్తాను. ఇంకా చెప్పాలంటే.. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇంత వరకు చేయని పాత్ర ఇది. పుష్ప రెండు భాగాల్లోను కనిపిస్తాను. పుష్ప ఆడియన్స్ కి థ్రిల్ కలిగిస్తుంది. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని చెప్పింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పుష్ప మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంవత్సరం చివరిలో పుష్ప ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్