Saturday, January 18, 2025
Homeసినిమాప్రభాస్ జోడీగా రష్మిక కనిపించే ఛాన్స్!

ప్రభాస్ జోడీగా రష్మిక కనిపించే ఛాన్స్!

ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇప్పుడు రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఒకటి మారుతి దర్శకత్వంలోని ‘రాజా సాబ్’ అయితే, మరొకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని ‘కల్కి’. ఈ రెండు సినిమాలు ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకున్నాయి. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా చేయవలసి ఉంటుంది. ఎనౌన్స్ మెంట్ ఎప్పుడో వచ్చింది. అందువలన ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్టుగా తెలుస్తోంది. ఈ డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగును మొదలెట్టే ఆలోచనలో ఉన్నారని టాక్. డిసెంబర్ నుంచి ప్రభాస్ డేట్స్ ఉన్నట్టుగా చెబుతున్నారు. అందువలన ఆ దిశగా ముందుకు వెళుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ముగ్గురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ జాబితాలో రష్మిక – కీర్తి సురేశ్ .. మృణాల్ ఠాకూర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

ప్రభాస్ సరసన నాయికగా ఇంతవరకూ చేయనివారినే తీసుకుందామనే నిర్ణయంతో, ఈ ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నారట. హను రాఘవపూడి కూడా ప్రభాస్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ‘సీతారామం’ సినిమాతో ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేసింది తనే. అందువలన బరిలో రష్మిక – కీర్తి సురేశ్ ఇద్దరు మాత్రమే ఉండొచ్చు. ‘యానిమల్’ సినిమాలో రష్మిక నటనను ఎంతో ప్రశంసిస్తూ వచ్చిన సందీప్, ఆమెను ఎంపిక చేసే అవకాశం ఎక్కువ అనే టాక్ వినిపిస్తోంది. అదే జరుగుతుందేమో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్