Saturday, January 18, 2025
Homeసినిమాతెలుగు సినిమాలకు దూరంగా రాశి ఖన్నా!

తెలుగు సినిమాలకు దూరంగా రాశి ఖన్నా!

టాలీవుడ్ కి ముద్దమందారం వంటి గ్లామర్ తో పరిచయమైన కథానాయిక రాశి ఖన్నా. ముద్దుగా .. బొద్దుగా ఉండే ఈ భామను చూసి కుర్రాళ్లు ముచ్చటపడ్డారు. ఆమె అభిమానులుగా ప్రకటించుకోవడానికి ఎంతమాత్రం ఆలస్యం చేయలేదు. అందంతో పాటు కాస్త అభినయం కూడా తెలిసిన ఈ బ్యూటీకి అదృష్టం కూడా కలిసొచ్చింది. అందువలన కెరియర్ ఆరంభంలోనే ఒక అరడజను హిట్లను పెద్దగా గ్యాప్ లేకుండానే తన ఖాతాలో వేసుకుంది.

రాశి ఖన్నా తన కెరియర్ ఆరంభంలో గ్లామర్ ఒలకబోయడానికి అంతగా ఉత్సాహం చూపించలేదు. చకచకా అవకాశాలను అందుకోవడంలో లౌక్యాన్ని కూడా చూపించలేకపోయింది. అందంగా ఉంటే సరిపోదు .. అందుకు తగిన లౌక్యం ఉండాలనే విషయాన్ని వంటబట్టించుకునేసరికి పుణ్యకాలం గడిచి పోయింది. ఒక్క తెలుగు సినిమాని మాత్రమే నమ్ముకుంటే సరిపోదనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో కూడా అంతే ఆలస్యం చేసింది. అందువలన ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ మాదిరిగా ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది.

ఆ తరువాత రాశి ఖన్నా నటన పరంగా చాలా విషయాలను తెలుసుకుంది. కామెడీ కూడా బాగా చేయగలదని అనిపించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించడం .. హాట్ ఫోటో షూట్ లు మొదలుపెట్టింది. అయినా ఆశించిన ప్రయోజనం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. రాశి ఖన్నా సన్నబడటం ఆమెకి మైనస్ అయిందనేది ఆమె అభిమానుల మాట. గతంలో ఇలా సన్నబడిన కీర్తి సురేశ్ కూడా తన పొరపాటు తెలుసుకుని మళ్లీ లైన్లో పడింది. ‘కొంతమంది లావైతే బాగుండరు .. ఇంకొంతమంది చిక్కితే బాగుండదు’ అంటూ ‘చంద్రముఖి’లో రజనీ చెప్పిన డైలాగ్ ను అభిమానులు గుర్తుచేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్