Ravanasura started: మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతున్న `రావణాసుర` సినిమాను సంక్రాంతి పర్వదినం రోజున మెగాస్టార్ చిరంజీవి, ఇతర అతిథుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక నుండి `రావణాసుర`పాలన ఆరంభం కానుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను చిత్రయూనిట్ ప్రారంభించింది. ప్రస్తుతం కీలక తారాగణంపై నైట్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తున్నారు.
అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. రవితేజ ఈ చిత్రంలో న్యాయవాదిగా కనిపించబోతోన్నారు. రామ్ పాత్రలో సుశాంత్ ముఖ్యమైన రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఐదు పాత్రలకు కూడా మంచి ప్రాముఖ్యత ఉండనుంది.
రచయితగా శ్రీకాంత్ విస్సా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయనే ఈ సినిమాకు కథను అందించారు. సుధీర్ వర్మ తన సినిమాలను ఎంత కొత్తగా, స్టైలీష్‌గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నారు. పోస్టర్‌ను బట్టే మనకు ఆ విషయం అర్థమవుతోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేయబోతున్నారు. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్‌గా, శ్రీకాంత్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read : రవితేజ ‘రావణాసుర’ నుంచి సుశాంత్ ఫస్ట్ లుక్ విడుదల