Sunday, January 19, 2025
Homeసినిమావాల్తేరు వీర‌య్య ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

వాల్తేరు వీర‌య్య ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

Chiru-Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి.. మోహ‌న్ రాజా డైరెక్ష‌న్ లో గాడ్ ఫాద‌ర్, మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్ లో భోళా శంక‌ర్ చిత్రాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాల‌తో పాటు బాబీ డైరెక్ష‌న్ లో వాల్తేరు వీర‌య్య అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స నిర్మిస్తోంది. అయితే.. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర ఉంది. ఆ పాత్ర‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో చేయించాల‌ని ఫిక్స్ అయ్యారు.

ఇప్పుడు ఈ పాత్ర గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఇంటర్వెల్ లో వచ్చే సీక్వెన్స్ లో రవితేజ ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. చిరుకి అనుచరుడి పాత్రలో రవితేజ నటిస్తున్నాడని.. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని స‌మాచారం. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటాయ‌ట‌. అలాగే రవితేజ పాత్ర చనిపోతుందని.. ఈ పాత్ర ద్వారానే చిరు పాత్రలో మార్పు వస్తోందని తెలిసింది.

ఈ న్యూస్ తెలిసిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. గ‌తంలో చిరంజీవి, ర‌వితేజ అన్న‌ద‌మ్ములుగా అన్న‌య్య చిత్రంలో న‌టించారు. ఆ సినిమా బిగ్ హిట్ అయ్యింది. చాలా గ్యాప్ త‌ర్వాత‌ ఇప్పుడు మ‌ళ్లీ క‌లిసి సినిమా చేస్తుండ‌డంతో వాల్తేరు వీర‌య్య పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. వాల్తేరు వీర‌య్య అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ప్ప‌టికీ అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌లేదు. మ‌రి.. ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతోన్న వాల్తేరు వీర‌య్య ఎంత వ‌ర‌కు మెప్పిస్తాడో చూడాలి.

Also Read : చిరు మూవీలో ర‌వితేజ క్యారెక్ట‌ర్ ఇదేనా.? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్